Diamond League Champion : భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సాధించాడు. గురువారం ఫైనల్లో జావెలిన్‌ను 88.44 మీటర్లు విసిరిన నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో ఫాల్ట్ చేసిన ఈ 24 ఏళ్ల ఒలింపిక్ ఛాంపియన్ తర్వాత గొప్పగా పుంజుకున్నాడు. రెండో ప్రయత్నంలో 88.44 మీటర్ల త్రోతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.
ఒలింపిక్స్ రజత విజేత, చెక్ రిపబ్లిక్ ఆటగాడు జాకబ్ వాద్లెచ్ (86.94మీ.) రెండో స్థానంలో నిలిచాడు. జర్మనీ ఆటగాడు వెబర్ జూలియన్ (83.73 మీటర్లు) మూడో స్థానం దక్కించుకున్నాడు.
నీరజ్ చోప్రా నయా చరిత్ర.. డైమండ్ లీగ్ ట్రోఫీ కైవసం
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సాధించాడు.
Neeraj Chopra The 1st Indian To Win Diamond League Trophy