Neeraj Chopra Paris Olympics :టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతాక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోసారి తన సత్తా నిరూపించాడు. 88.77 మీటర్ల త్రోతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి ప్రవేశించడం సహా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్స్ పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్లు బల్లెం విసిరి.. ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
అదరగొట్టిన నీరజ్..
Neeraj Chopra Career Best Record :హంగేరీ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ క్వాలిఫయర్స్ తొలి ప్రయత్నంలోనే ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో నీరజ్ చోప్రాఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫైయింగ్ గ్రూప్-ఏలో పోటీపడిన నీరజ్ చోప్రా 88.77 మీటర్లు విసిరాడు. దీంతో ఫైనల్‌కు కటాఫ్ మార్క్ 83 మీటర్లను అధిగమించడం వల్ల ఫైనల్‌కు చేరాడు. కాగా.. ఆదివారం ఫైనల్ జరగనుంది. అలాగే ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు చేరుకోవడం వల్ల పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత సాధించాడు. మరో జావెలిన్ త్రో అథ్లెట్ మను తొలి రౌండ్‌లో 78.10 మీటర్లు విసరగా.. రెండో ప్రయత్నంలో 81.31 మీటర్లు విసిరాడు.
Neeraj chopra diamond league 2023 :
అంతకుముందు.. ఈ ఏడాది జూన్‌లో లుసానె డైమండ్ లీగ్ పోటీల్లోనూనీరజ్ చోప్రాసత్తా చాటాడు. లుసానె డైమండ్ లీగ్ పోటీల్లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగించి అగ్రస్థానంలో నిలిచాడు. గాయం నుంచి కోలుకుని ఈ టోర్నీలో పునరాగమనం చేసిన అతడు.. జావెలిన్‌ను 87.66 మీటర్లు విసిరి విజేతగా అవతరించాడు. హేమాహేమీలు బరిలో నిలిచిన ఈ పోటీల్లో నీరజ్.. తన తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో 83.52 మీటర్లు, మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు బల్లెంను విసిరాడు. అయితే నాలుగో ప్రయత్నంలో మళ్లీ నీరజ్ విఫలమయ్యాడు. ఐదో ప్రయత్నంలో మాత్రం బల్లెంను 87.66 మీటర్లు విసిరి ఒక్కసారిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక రెండో స్థానంలో నిలిచిన జర్మని అథ్లెంట్ జులియన్ వెబర్ 87.03 మీటర్లు బల్లెంను విసరగా, మూడో స్థానానికి పరిమితమైన జాకబ్ వాద్లిచ్ (చెక్ రిపబ్లిక్) 86.13 మీటర్ల దూరాన్ని విసిరాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Neeraj Chopra World Ranking : జావెలిన్‌లో నీరజ్ నం.1.. ఆ స్టార్ అథ్లెట్‌ను వెనక్కి నెట్టి!
'రెజ్లర్ల నిరసన బాధాకరం.. వారి గౌరవం కాపాడే బాధ్యత మనపైనే'.. నీరజ్ చోప్రా ట్వీట్