తెలంగాణ

telangana

ETV Bharat / sports

అభిమాన నటుడ్ని కలిసిన నీరజ్ చోప్డా

టోక్యో ఒలింపిక్స్ హీరో నీరజ్ చోప్డా తన అభిమాన నటుడు రణ్​దీప్ హుడాని కలిశారు. ఈ విషయాన్ని రణ్​దీప్ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు.

Neeraj Chopra
నీరజ్ చోప్రా

By

Published : Aug 26, 2021, 5:31 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్డా బుధవారం తన అభిమాన నటుడు రణ్‌దీప్‌ హుడాని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను రణ్‌దీప్‌ హుడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌లో కలుసుకున్న వీరు తెల్లని దుస్తుల్లో కనిపించారు.

"సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎక్కడ చేరుకుంటారు?ఈ ప్రశ్న చాలా తక్కువమందికి ఎదురవుతుంది. అందులోనూ చాలా కొద్దిమంది వద్దే దీనికి సమాధానం ఉంటుంది. అలాంటి వారిలో ఒకరిగా నిన్ను కలిశా. నువ్వు అంత ఎత్తు ఎదిగావని తమ్ముడు" అంటూ నీరజ్‌ని ఉద్దేశించి రాసుకొచ్చారు రణ్​దీప్.

2021, ఆగస్టు16 నీరజ్‌ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇందులో నీరజ్‌.. "ఇంగ్లీష్‌, పంజాబీ, హిందీ.. ఈ మూడు భాషల్లో సినిమాలు చూస్తా. రణ్‌దీప్‌ నటన అంటే నాకు ఇష్టం, ఆయన నటించిన 'లాల్‌రంగ్‌' అంటే చాలా ఇష్టం. మొత్తం హరియాణాలో మాట్లాడుకునే యాసలో ఉంటుందీ సినిమా అంతా. అవే కాదు.. ఆయన నటించిన 'సర్బజీత్‌', 'హైవే' కూడా ఆకట్టుకున్నాయి" అని చెప్పారు.

2018 ఆసియా క్రీడల్లో విజయం సాధించాక.. తన బయోపిక్‌లో ఏ హీరో నటిస్తే బాగుంటుందన్న ప్రశ్నకు నీరజ్‌.. రణ్‌దీప్‌ హుడా బాగుంటాడని చెప్పాడు. కాగా ఈ ఇద్దరిదీ ఒకే రాష్ట్రం (హరియాణా) వాళ్లేకాదు. ఇద్దరికీ క్రీడలంటే మక్కువ కూడా.

ఇవీ చూడండి: పాకిస్థాన్ కోచ్​కు కరోనా.. 10రోజులు క్వారంటైన్

ABOUT THE AUTHOR

...view details