Neeraj Chopra Fitness : అథ్లెట్స్‌కు ఫిట్‌నెస్ కాపాడుకోవడమంటే పెద్ద సవాల్ అనే చెప్పాలి. శరీరంలో ఏ కాస్త మార్పు వచ్చినా వారి కెరీర్‌పై చాలా ఎఫెక్ట్ చూపుతుంది. ముఖ్యంగా బాడీలోని కొవ్వు శాతం 10 లోపలే స్థిరంగా ఉంచడం చాలా కఠినమైన విషయం. కానీ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రం దాదాపు నాలుగేళ్లుగా తన బాడీ ఫిట్నెస్ను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. తాజాగా ప్రపంచ ఛాంపియన్‌గా అతడు(Neeraj Chopra Wins Gold) అవతరించిన నేపథ్యంలో తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ను తెలిపాడు నీరజ్.
డైట్ ఇలా.. "నిద్ర లేవగానే జ్యూస్ లేదా కొబ్బరి నీటితో రోజును ప్రారంభిస్తాను. మార్నింగ్ హెల్తీ అండ్ లైట్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటాను. వీటిల్లో మూడు లేదా నాలుగు ఎగ్‌వైట్స్, రెండు బ్రెడ్ ముక్కలు, ఒక కప్పు నిండా పప్పులు, పండ్లు తింటాను. మధ్యాహ్న భోజనంలో అన్నం, పెరుగు, పప్పు ధాన్యాలు, గ్రిల్ చేసిన చికెన్, సలాడ్ తీసుకుంటాను. అదే ట్రైనింగ్ క్యాంప్‌లో అయితే భోజనం తర్వాత గ్యాప్‌లో పండ్లు, బాదం పప్పు తింటాను. నైట్ టైమ్ డిన్నర్ తేలిగ్గా ఉండేట్లు చూసుకుంటాను. ఆ సమయంలో సూప్, ఉడకబెట్టిన కూరగాయలు, పండ్లు తీసుకుంటాను" అని నీరజ్ చెప్పాడు.