Neeraj Chopra: ఒలింపిక్ జావెలిన్ త్రో స్వర్ణ విజేత నీరజ్ చోప్డా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రతి ఈవెంట్‌కు మెరుగువుతున్న అతడు స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లోనూ మెరిశాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 89.94 మీటర్లు త్రో చేసి రజతం సాధించాడు. డైమండ్ లీగ్‌లో నీరజ్‌కు ఇదే తొలి పతకం. 24 ఏళ్ల నీరజ్ ఇటీవల పావో నుర్మి క్రీడల్లో 89.30మీ త్రోతో జాతీయ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డైమండ్ లీగ్‌లో అతడు తన తొలి ప్రయత్నంలోనే 89.94 మీటర్ల త్రో చేశాడు. ఆ తర్వాత వరుసగా 84.37మీ, 87.46మీ, 84.77మీ, 86.67మీ, 86.84మీ త్రోలు చేశాడు. స్వర్ణ విజేత పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా) తన మూడో ప్రయత్నంలో 90.31 మీటర్ల త్రో చేసే వరకు నీరజ్‌దే అత్యుత్తమ ప్రదర్శన. జర్మనీ ఆటగాడు వెబ్బర్ (89.08మీ) కాంస్యం గెలుచుకున్నాడు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు 22 మందితో.. జులై 15న అమెరికా వేదికగా ఆరంభమయ్యే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ 22 మంది సభ్యుల బృందాన్ని పంపిస్తోంది. వీరిలో పదిహేడు మంది పురుషులు, అయిదుగురు మహిళలు ఉన్నారు. నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) భారత జట్టులో ప్రధానాకర్షణ.