తెలంగాణ

telangana

ETV Bharat / sports

Neeraj Chopra Family Background : 'కలిసుంటే కలదు సుఖం.. ఇదే నీరజ్ విజయాలకు కారణం'

Neeraj Chopra Family Background : ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్​షిప్​లో స్వర్ణ పతకం సాధించి నీరజ్​ చోప్రా చరిత్ర సృష్టించాడు. అతడి విజయం వెనుక ఉమ్మడి కుటుంబ ఉందని నీరజ్​ చోప్రా తండ్రి సతీష్​ చోప్రా తెలిపారు. ఇంకా ఆయన ఎమన్నారంటే?

Neeraj Chopra Father
Neeraj Chopra Father

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 5:53 PM IST

Updated : Aug 29, 2023, 7:23 PM IST

Neeraj Chopra Family Background :నీరజ్​ చోప్రా సాధించిన విజయాలన్నింటి వెనక తమ ఉమ్మడి కుటుంబ సహకారం ఉందని ఆయన తండ్రి సతీష్​ చోప్రా తెలిపారు. ఉమ్మడి కుటుంబ సభ్యులు అండగా నిలవడం వల్లే నీరజ్ చోప్రా ఇన్ని విజయాలను సాధించాడని ఆయన అన్నారు. ఆయన నీరజ్ కుటుంబానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.

నీరజ్ చోప్రా తండ్రి

"మా తండ్రి పేరు ధరమ్​ సింగ్​. మేము నలుగురు అన్నదమ్ములం.​ మేమందం ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోకూడదని మా నాన్న చిన్నప్పుడే చెప్పారు. ఆయన చెప్పిన ఆ మాటలు ఎప్పటికీ నాకు గుర్తున్నాయి. మేము అలానే చేశాము. ఉమ్మడి కుటుంబం అందించిన సహకారం వల్లే నీరజ్​ చోప్రా విజయాలను సాధిస్తున్నాడు. నాకు భీమ్​ చోప్రా, సుల్తాన్​ చోప్రా, సురేంద్ర చోప్రా అనే ముగ్గురు సోదరులు ఉన్నారు. భీమ్​ చోప్రా పిల్లల పెంపంకం, చదువు, ఆటల బాధ్యతలను చూసుకుంటారు. సుల్తాన్​ వ్యవసాయ పనులను చూస్తారు. సురేంద్ర చోప్రా ఇతర బాధ్యతలను నిర్వర్తిస్తారు. నేను ఇంటికి వచ్చే బంధువులు, కుటుంబ బాధ్యతలను చూసుకుంటాను."
--సతీష్​ చోప్రా, నీరజ్​ చోప్రా తండ్రి

ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న నీరజ్ చోప్రా తండ్రి సతీష్ చోప్రా

ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో నీరజ్​ చోప్రా బంగారు పతకం సాధించడం పట్ల తమ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారని సతీశ్ చోప్రా సోదరుడు భీమ్ చోప్రా తెలిపారు. నీరజ్ ఇంటికి వచ్చిన తర్వాత సంబరాలను చేసుకుంటామని అన్నారు. 'నీరజ్​ చోప్రాతో మాట్లాడిన తర్వాత విజయ సంబరాలను నిర్వహిస్తాం. ఇంకా నీరజ్ పలు లీగ్​ల్లో పాల్గొనాలి. వాటి కోసం శ్రమిస్తున్నాడు. నీరజ్​ చోప్రా ఇండియన్​ ఆర్మీలో సుబేదార్​గా ఉన్నాడు.' అని తెలిపారు.

నీరజ్ చోప్రా కుటుంబం

నీరజ్​ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో గోల్డ్ మెడల్​ను సాధించి మరోసారి తన సత్తాను చాటుకున్నాడు. ఆగస్ట్​ 27న హంగేరీలోని బుడాపెస్ట్​లో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​​ ఫైనల్​ల్లో ఈ ఘనతను సాధించాడు. 2021 టోక్యో ఒలింపిక్స్​లో గోల్డ్​మెడల్​ సాధించాడు నీరజ్​.
PM Modi Congratulates Neeraj Chopra : ఇటీవలే ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్​ చోప్రాను.. ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అంకితభావం, కచ్చితత్వమే నీరజ్​ చోప్రాను ప్రపంచ ఛాంపియన్​గా నిలిపాయని ఆయన అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం నీరజ్ చోప్రాను అభినందించారు. ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన నీరజ్​ను చూసి భారతదేశం గర్విస్తోందని తెలిపారు. అతడి విజయాన్ని చూసి దేశంలోని లక్షలాది మంది యువత స్ఫూర్తి పొందుతారని అన్నారు. ఇలాంటి విజయాలతో నీరజ్​.. మరింత ఎదగాలని కోరుకుంటున్నట్లు ముర్ము తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Neeraj Chopra Journey And Challenges : ఎన్నో అవమానాలు.. నీరజ్‌ లైఫ్ మలుపు తిరిగిందిలా.. బల్లెం వీరుడి కథ ఇది!

Neeraj Chopra Wins Gold : బల్లెం వీరుడు నీరజ్​ స్వర్ణ చరిత్ర.. ప్రపంచ ఛాంపియన్‌షిప్​లో తొలి భారత అథ్లెట్​గా ఘనత

Last Updated : Aug 29, 2023, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details