Diamond league Neeraj chopra record టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనతను సాధించాడు. డైమండ్ లీగ్ అథ్లెటిక్స్‌లో అతడు సత్తా చాటాడు. లుసానె అంచెలో అతడు అగ్రస్థానంతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
మళ్లీ చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా, తొలి భారత్ అథ్లెట్‌గా
Diamond league Neeraj chopra record డైమండ్ లీగ్‌లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రికార్డ్ సాధించాడు. ఈ లీగ్ మీట్‌లో విజేతగా నిలిచిన తొలి భారత అథ్లెట్ అతడే కావడం విశేషం.
నీరజ్ చోప్రా
అంతేకాదు జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్ బెర్తు సైతం దక్కించుకున్నాడు. డైమండ్ లీగ్ మీట్‌లో విజేతగా నిలిచిన తొలి భారత అథ్లెట్ నీరజే కావడం విశేషం. ఈ పోటీ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచిన నీరజ్.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేశాడు.
ఇదీ చూడండి:ఆసియా కప్ సమరానికి సిద్ధం, ఈసారి అంతకుమించి
Last Updated : Aug 27, 2022, 10:19 AM IST