90 మీటర్ల జావెలిన్ త్రో మార్క్‌ను ఎప్పుడు సాధిస్తారు అనే ప్రశ్నకు ఈ ఏడాదే సమాధానం చెబుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు ఒలింపిక్ జావెలిన్ త్రో ఛాంపియన్ నీరజ్ చోప్రా. ఒలింపిక్‌లో స్వర్ణం గెలుచుకున్న నీరజ్.. గట్టి పోటీ ఉండే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతాన్ని ముద్దాడాడు. అంతేగాక గతేడాది స్వీడన్లో జరిగిన డైమండ్ లీగ్ టైటిల్‌నూ కైవసం చేసుకున్నాడు నీరజ్. కెరీర్లో ఎన్నో మైలు రాళ్లను చేరుకున్న నీరజ్‌ను ఎప్పుడు వెంటాడే ప్రశ్న.. 'నీరజ్ ఎప్పుడు 90 మీటర్ల త్రోను విసురుతాడు'..? అయితే తాజాగా దీనికి బదులిచ్చాడు నీరజ్ చోప్రా. ఈ ఏడాదే ఈ ప్రశ్నకు ముగింపు పలుకుతానని స్పష్టం చేశాడు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుతో ముచ్చటించిన నీరజ్ చోప్రా.. ఈ విషయంపై మాట్లాడాడు.
"ఈ సంవత్సరమే నేను 90 మీటర్ల మార్క్‌ను అధిగమిస్తాను. దీనిని మీరు ఎప్పుడు ఛేదిస్తారని నన్ను చాలా మంది చాలా సార్లు నన్ను అడిగారు. అయితే ఈ ఏడాదే ఆ ప్రశ్నకు సమాధానం చెబుతానని అనుకుంటున్నాను."