ఎన్బీఏ బాస్కెట్‌బాల్ లీగ్-2020 సీజన్‌ను జులై 30 నుంచి ప్రారంభించాలని నిర్వహకులు భావించారు. ఈ నేపథ్యంలో 302 మంది ప్లేయర్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఫలితాల్లో 16 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఎన్బీఏ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకిన వాళ్లు.. తగ్గిన తర్వాత ఆటలో పాల్గొనాలంటే వైద్యుడి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని స్పష్టం చేసింది.
అయితే సక్రమెంటో కింగ్స్‌కు చెందిన ఆటగాళ్లు జబారీ పార్కర్, అలెక్స్ లెన్‌తో పాటు ఇండియానా పేసర్స్ ప్లేయర్ మాల్కమ్ బ్రోగ్డన్.. తమకు కరోనా సోకిందని బుధవారమే తెలిపారు.