తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముగిసిన ఎన్​బీఏ సంబరం.. పేసర్స్​ జయకేతనం - nba matches in india

భారత్​లో ఎన్​బీఏ ఎగ్జిబిషన్​ మ్యాచ్​లు ముగిశాయి. శాక్రమెంటో కింగ్స్, ఇండియానా పేసర్స్​ మధ్య జరిగిన రెండు మ్యాచ్​ల్లోనూ పేసర్స్​ జయకేతనం ఎగరేసింది.

ఎన్​బీఏ

By

Published : Oct 6, 2019, 7:26 AM IST

భారత్​లో నేషనల్ బాస్కెట్​బాల్ అసోషియేషన్ (ఎన్​బీఏ) సందడి ముగిసింది. రెండు రోజుల పాటు బాస్కెట్​బాల్ ప్రియుల్ని అలరించిన ఎగ్జిబిషన్ మ్యాచ్​లకు తెరపడింది. తొలి రోజు ఉత్కంఠ పోరులో 132-131 తేడాతో శాక్రమెంటో కింగ్స్​ను ఓడించిన ఇండియానా పేసర్స్.. రెండో మ్యాచ్​లోనూ జయకేతనం ఎగరేసింది.

ముంబయిలో జరిగిన ఈ మ్యాచ్​లో పేసర్స్​ 130-106 తేడాతో కింగ్స్​ను ఓడించింది. మ్యాచ్​లో నాలుగు క్వార్టర్లలోనూ పేసర్స్​ ఆధిపత్యమే సాగింది. అలిజ్ జాన్సన్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్​గా నిలిచాడు.

భారత్​లో ఎన్​బీఏకు ఆదరణ పెంచేందుకు రిలయన్స్ ఫౌండేషన్​తో కలిసి ఈ మ్యాచ్​లు నిర్వహించారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే ఎన్​బీఏ కొత్త సీజన్​కు ఈ మ్యాచ్​లను పేసర్స్, కింగ్స్​ సన్నాహకంగా ఉపయోగించుకున్నాయి. ఈ మ్యాచ్​ల నిర్వహణ భారత్-అమెరికా సంబంధాల్లో చరిత్రాత్మక సందర్భమని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. గత నెల ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్​ భారత్​లో ఎన్​బీఏ మ్యాచ్​ల గురించి ప్రస్తావించారు.

ఇవీ చూడండి.. తొలి టెస్టులో గెలుపు మాదే: ఫిలాండర్

ABOUT THE AUTHOR

...view details