తెలంగాణ

telangana

ETV Bharat / sports

నీటిపై తేలియాడే బాస్కెట్​బాల్ కోర్టు ఇది - ఎన్​బీఏ

బాస్కెట్​బాల్ క్రీడను.. భారత్​లో విస్తృతపరిచే కార్యక్రమంలో భాగంగా నీటిపై తేలియాడే కోర్టును ఆవిష్కరించింది ఎన్​బీఏ.

నీటిపై తేలియాడే బాస్కెట్​బాల్ కోర్టు ఇది

By

Published : Oct 3, 2019, 12:42 PM IST

Updated : Oct 4, 2019, 8:45 AM IST

భారత్​లో బాస్కెట్​బాల్​ క్రీడకు ఆదరణ పెంచేందుకు సిద్ధమవుతోంది ఎన్​బీఏ. అందులో భాగంగానే ఈ ఏడాది తొలిసారిగా ఈ ఆటను ఇక్కడ ప్రవేశపెడుతోంది. ప్రచారంలో భాగంగా బుధవారం.. ముంబయిలోని బాంద్రా సమీపంలో నీటిపై తేలియాడే బాస్కెట్​బాల్ కోర్టును ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో క్రీడా ఔత్సాహికులతో పాటు ఎన్​బీఏ దిగ్గజం జేసన్ విలియమ్స్ సందడి చేశాడు.

ముంబయి వేదికగా జరిగే ఈ ఈవెంట్​లో సక్రమెంటో కింగ్స్, ఇండియానా పేసర్స్ అనే రెండు జట్లు.. ప్రీసీజన్​ గేమ్స్​లో తలపడనున్నాయి. ఈనెల 4, 5 తేదీలలో ఎస్​విపి స్టేడియంలో మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇది చదవండి: సఫారీలపై రోహిత్- మయాంక్ రికార్డు భాగస్వామ్యం

Last Updated : Oct 4, 2019, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details