తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రీడా పురస్కారాల ఎంపిక ఆలస్యం.. ఎందుకంటే? - ఒలింపిక్స్​ నేపథ్యంలో క్రీడా పురస్కారాలు వాయిదా

జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక ప్రక్రియ(National sports awards selection) ఈసారి కాస్త ఆలస్యం కానుంది. టోక్యో ఒలింపిక్స్​ను దృష్టిలో ఉంచుకొని ఈ అవార్డుల ఎంపికకు ఎక్కువ సమయం తీసుకోనున్నట్లు క్రీడా శాఖ వర్గాలు వెల్లడించాయి.

National sports awards, dhyanchand birth anniversary
జాతీయ క్రీడా పురస్కారాలు, ధ్యాన్​చంద్​ జయంతి

By

Published : Jul 13, 2021, 6:53 AM IST

జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక ప్రక్రియ(National sports awards selection) ఈసారి ఆలస్యం కానుంది. టోక్యో ఒలింపిక్స్​లో క్రీడాకారుల ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తుండటమే ఇందుకు కారణం. ప్రతి ఏడాది ఆగస్టు 29న మేజర్ ధ్యాన్​చంద్ జయంతి(major dhyan chand birth anniversary) సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం రోజు పురస్కారాలు అందజేస్తారు.

"ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల కోసం దరఖాస్తులు స్వీకరించాం. దరఖాస్తులకు తుది గడువు కూడా ముగిసింది. అయితే ఒలింపిక్స్​లో పతకాలు సాధించే క్రీడాకారుల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని గత సమావేశంలో నిర్ణయించాం. ఆగస్టు 8న ఒలింపిక్స్ ముగుస్తాయి. కాబట్టి అవార్డుల ఎంపిక ప్రక్రియ కాస్త ఆలస్యం కానుంది. ఒలింపిక్స్​లో ఎవరైనా పతకం గెలిస్తే ఆ ప్రదర్శనను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం" అని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొంటారు?

ABOUT THE AUTHOR

...view details