అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) చీఫ్‌గా ఉన్న నరీందర్ బత్రా పదవీకాలాన్ని వచ్చే ఏడాది మే వరకు పొడిగించారు. కరోనా ప్రభావంతో వార్షిక సమావేశం వాయిదా పడటం వల్లే ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితులు వచ్చాయి. ఈయనతో పాటు కార్యవర్గం పదవీకాలాన్ని పొడిగించారు. ప్రస్తుతం నరీందర్.. భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.
అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్ పదవీ కాలం పొడిగింపు - అంతర్జాతీయ హాకీ సమాఖ్య
ఎఫ్ఐహెచ్ చీఫ్ నరీందర్ బత్రాతో పాటు కార్యవర్గం పదవీకాలాన్ని మరో ఏడాది పెంచారు. అక్టోబరులో జరగాల్సిన వార్షిక కాంగ్రెస్‌ను వాయిదా వేశారు.
![అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్ పదవీ కాలం పొడిగింపు అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్ పదవీ కాలం పొడిగింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7132609-218-7132609-1589036252583.jpg)
నరీందర్ బత్రా
శుక్రవారం ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన ఎఫ్ఐహెచ్ కార్యవర్గ భేటీలో మాట్లాడుతూ.. అక్టోబరు 28న జరగాల్సిన వార్షిక కాంగ్రెస్‌ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు నిర్వహించేది త్వరలో చెబుతామని పేర్కొన్నారు.