కెరీర్లో 12వ సారి బార్సిలోనా ఓపెన్ ఫైనల్లో నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్. ఆదివారం జరిగిన తుదిపోరులో గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్‌ను 6-4,6-7(6 8),7-5తేడాతో ఓడించాడు. ఈ ఏడాది నాదల్కు ఇది తొలి టైటిల్ కాగా.. కెరీర్‌రో 87వది.
బార్సిలోనా ఫైనల్లో నాదల్ విజయం- 12వ టైటిల్ కైవసం - Nadal Tsitsipas
ఆదివారం జరిగిన బార్సిలోనా ఓపెన్ ఫైనల్లో గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్‌ను చిత్తు చేశాడు స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్. కెరీర్లో 12వ సారి బార్సిలోనా టైటిల్‌ను దక్కించుకున్నాడు .
నాదల్
2018లో జరిగిన బార్సిలోనా ఫైనల్లోనూ సిట్సిపాస్‌ను నాదల్ ఓడించాడు. అయితే 2019 మాడ్రిడ్ సెమీఫైనల్లో నాదల్‌పై సిట్సిపాస్ పైచేయి సాధించాడు.
Last Updated : Apr 26, 2021, 11:45 AM IST