ఒలింపిక్ పతక విజేతలకు దిల్లీలోని హోటల్ అశోకలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్, క్రీడా సహాయక మంత్రి నిశిత్ ప్రామాణిక్, న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు పాల్గొన్నారు.
స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్డాతో పాటు కాంస్య పతక విజేత బజ్రంగ్ పూనియా, రెజ్లర్ రవి దహియా, పురుషుల హాకీ టీమ్, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ను సన్మానించారు.
"జావెలిన్ త్రో ఫైనల్లో నేను ప్రత్యేకత సాధించానని అర్థమైంది. నా వ్యక్తిగత రికార్డును (88.07 మీ.) అధిగమించాననుకున్నాను. బల్లెం బాగా విసిరాను. పోటీలు ముగిసిన తర్వాత రోజు కూడా ఒళ్లు నొప్పులు బాగా ఉన్నాయి. కానీ, నేను సాధించిన దాంతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఈ పసిడి పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నాను."