తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచంలోనే ఖరీదైన బాక్సింగ్​ మ్యాచ్​.. విన్నర్​కు 1800 కోట్లు.. రన్నరప్ 1000 కోట్లు! - floyd mayweather vs manny pacquiao

సాధారంగా ఏదైనా ఓ మ్యాచ్​ గెలిస్తే.. విజేతకు ట్రోఫీతో పాటు కొంత ప్రైజ్​ మనీని అందజేస్తారు. ఆ సొమ్ము లక్ష, ఐదు లక్షలు మహా అయితే రూ.10-20 కోట్లు ఉండొచ్చు. కానీ విన్నర్​కు రూ.1800 కోట్లు రన్నరప్​కు రూ.1000 కోట్లు ఇచ్చారని మీరు ఎప్పుడైనా విన్నారా? అవును ఇది నిజం. దాని​ గురించే ఈ కథనం..

Most Expensive Boxing Match in World
floyd mayweather vs manny pacquiao

By

Published : May 9, 2023, 2:07 PM IST

ఒక్క రింగ్​.. ఇద్దరు పోటీ దారులు. మ్యాచ్​లో ఉన్న ఇద్దరు ప్లేయర్లకు చేతికి గ్లవ్స్​ ధరించి ప్రత్యర్థుల పళ్లు రాలగొడుతామన్న కసి. పోటాపోటీగా జరిగే మ్యాచ్​. ఆఖరికి విజయం మాత్రం ఒకరికే. ఇవి సాధారణ బాక్సింగ్​ మ్యాచ్​ల ప్రక్రియ. ఇందులో గెలిచిన వారికి కప్​ దొరికితే.. ఓడిన వారికి మాత్రం దెబ్బలే మిగులుతాయి. దశాబ్దాల పాటు మనం ఇలాంటి మ్యాచ్​లే చూస్తూ వచ్చాము. అయితే, భారత్​లో బాక్సింగ్‌కు అంతగా ఆదరణ లేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్​కు అభిమానుల సంఖ్య కోట్లలో ఉంది. ఇక మైక్​ టైసన్​, మహ్మద్​ అలీ లాంటి దిగ్గజ ప్లేయర్లు రింగ్​లో మెరుస్తుంటే చూసి మురిసిపోయిన అభిమానులు ఉన్నారు.

Most Expensive Boxing Fight : ఇప్పటి వరకు మీరు ఎన్నో బాక్సింగ్​ మ్యాచ్​లను చూసుందొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్థావించబోయే మ్యాచ్​ గురించి మీరు ఏ మాత్రం కనివిని ఎరుగుండరు. ఎందుకంటే ఇందులో గెలిచిన వారికి 1800 కోట్లు వరించింది. ఓడిన వారికి 1000 కోట్లు దక్కింది. ఇది విని మీరు కచ్చితంగా షాక్​ అయ్యుంటారు. అయితే ఇటువంటి మ్యాచ్​ నిజంగానే జరిగింది. అది కూడా 2015లో. అప్పట్లోనే సెన్సేషన్​ సృష్టించిన ఈ మ్యాచ్​ చరిత్రలో నిలిచిపోయింది.

floyd mayweather vs manny pacquiao : 2015లో ఫ్లాయిడ్ మేవెదర్- మానీ పాక్వియావో మధ్య జరిగిన ఆ మ్యాచ్​ ఆద్యంతం ఎంతో ఉత్కంఠంగా సాగింది. ఎంతలా అంటే స్టేడియంలోని అన్ని సీట్ల టిక్కెట్లు కేవలం నిమిషంలోపే అమ్ముడుపోయాయి. అది కూడా వేల డాలర్లకు. దీంతో ఈ ఫైట్‌కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇందులో సాధారణ ప్రేక్షకుల కోసం నిర్వాహకులు కేవలం 500 టిక్కెట్లు మాత్రమే జారీ చేయగా.. దీని ధర $1500 నుండి $7500 వరకు పలికింది.

most expensive boxing match tickets : ఈ పోరాటాన్ని చూసేందుకు ప్రజలు బారులు తీరారు. యూఎస్​లోని ఎంజీఎం గ్రాండ్ స్టేడియంలో ఈ మ్యాచ్​ జరిగింది. సుమారు 16800 మంది ఆడియన్స్​ కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ గ్రౌండ్​లో ఈ ఉత్కంఠ పోరు జరగడం అనేది మ్యాచ్​కు మరో హైలైట్​. ఇక దీని చివరి రౌండ్ 2015 మే 2 జరిగింది. ఇక మేవెదర్, పకియావోలు బరిలోకి దిగిన వెంటనే ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఇద్దరి మధ్య జరిగిన మ్యాచ్​ ఓ భీకర యుద్ధాన్ని తలపించింది. ఇక 12 రౌండ్లు ముగిసే సమయానికి జడ్జీల ప్యానెల్.. ఫ్లాయిడ్ మేవెదర్‌ను మ్యాచ్ విజేతగా ప్రకటించాలని నిర్ణయించింది. అలా 18000 కోట్ల భారీ నజరానా ఈ అమెరికన్​ బాక్సర్​ను వరించింది.​

ABOUT THE AUTHOR

...view details