ఆదివారం జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ 150 అప్ ఫార్మాట్ ఫైనల్లో భారత ఆటగాడు పంకజ్ అడ్వాణీ విజయం సాధించాడు. మయన్మార్ ఆటగాడు నా తవెపై 6-2 తేడాతో గెలిచాడు. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
"శుభాకాంక్షలు పంకజ్ అడ్వాణీ. నువ్వు సాధించిన విజయాలను చూసి దేశం మొత్తం గర్విస్తోంది. నీ పట్టుదల ప్రశంసనీయం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా."
-ప్రధాని నరేంద్ర మోదీ