నాలుగుసార్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన మోఫరా.. కొత్త రికార్డు నెలకొల్పాడు. వాన్ డేమ్ డైమండ్ లీగ్ సిరీస్ ఓ గంట రేసులో అతను 21.330 కిలోమీటర్లు పరుగెత్తి ప్రపంచ రికార్డును సెట్ చేశాడు. 13 ఏళ్ల క్రితం హైలీ గెబ్రెసెలాసీ (21.285 కి.మీ, ఇథియోపియా) ఘనతును ఈ ఇంగ్లాండ్ రేసర్ అధిగమించాడు.
'డైమండ్ లీగ్'లో మోఫరా సరికొత్త రికార్డు - మో ఫరా ప్రపంచ రికార్డు
ఒలింపిక్ ఛాంపియన్ మోఫరా అరుదైన ఘనత సృష్టించాడు. వాన్ డేమ్ డైమండ్ లీగ్ సిరీస్ గంట రేసులో ఏకంగా 21.330 కిలోమీటర్లు పరుగెత్తి సరికొత్త ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.

రన్నింగ్ రేసులో మోఫరా సరికొత్త రికార్డు
ఇదే ఈవెంట్లో మహిళల విభాగంలో సిఫాన్ హసన్ కూడా ప్రపంచ రికార్డుతో స్వర్ణాన్ని నెగ్గింది. గంటలో 18.517 కిలో మీటర్లు పరుగెత్తిన ఆమె... డైర్ ట్యూన్ (ఇథియోపియా, 18.930 కి.మీ, 2008)ను అధిగమించింది.