Mirabai Chanu: ఒలింపిక్స్ పతక విజేత, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను స్వర్ణం గెలుచుకుంది. సింగపూర్ వేదికగా జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ టోర్నీలో శుక్రవారం ఈ ఘనత సాధించింది. 55 కేజీల విభాగంలో తొలిసారిగా పోటీ పడిన చాను.. 191 కేజీలు (86 కిలోలు +105 కిలోలు) ఎత్తి విజేతగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన జెస్సికా సెవాస్టెన్కోస్ 167 కేజీ (77+90), మలేసియాకు చెందిన ఎల్లీ కెసాండ్రా ఎంగ్లీబెర్ట్ 165 కేజీ (75+90) నిలిచారు.
కామన్వెల్త్కు అర్హత..