తెలంగాణ

telangana

ETV Bharat / sports

Milkha Singh: స్థిరంగా మిల్కా సింగ్ ఆరోగ్యం

భారత మాజీ అథ్లెటిక్ మిల్కా సింగ్​ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్య బృందం తెలిపింది. రెండు వారాల క్రితం కొవిడ్ బారిన పడిన ఆయనను ప్రస్తుతం చంఢీగడ్​లోని 'పీజీఐఎమ్ఈఆర్​'లో ఉన్నారు. ముగ్గురు సభ్యుల వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.

By

Published : Jun 4, 2021, 7:36 PM IST

milkha singh, indian sprinter
మిల్కా సింగ్, భారత మాజీ స్ప్రింటర్

భారత మాజీ స్ప్రింటర్​ మిల్కా సింగ్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు.. చంఢీగడ్​లోని పోస్ట్​ గ్రాడ్యుయేట్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్​ అండ్ రీసెర్చ్​(PGIMER) వైద్య బృందం వెల్లడించింది. కొవిడ్ ప్రభావంతో ఇటీవల ముందస్తు జాగ్రత్తతో మరోసారి ఐసీయూలో చేరారు మిల్కా.

రెండు వారాల క్రితం కొవిడ్ బారిన పడిన మిల్కా సింగ్​ను తొలుత చంఢీగడ్​లోని తన ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంచారు. తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం కోసం మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించారు. వారం క్రితం ఆ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. మళ్లీ పరిస్థితి కాస్త అదుపు తప్పడం వల్ల తిరిగి పీజీఐఎంఈఆర్​లోని ఐసీయూలో చేర్పించారు.

"కొవిడ్ కారణంగా మిల్కా సింగ్ ఇక్కడ చేరారు. అన్ని వైద్య పరీక్షల తర్వాత ఈ రోజు ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆయన ఆరోగ్యాన్ని ముగ్గురు వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు" అని ప్రొఫెసర్​ అశోక్ కుమార్ తెలిపారు.

అంతకుముందు మిల్కా సింగ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:ఐసీయూలో దిగ్గజ అథ్లెట్​ మిల్కా సింగ్

ABOUT THE AUTHOR

...view details