కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన భారత్ లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. ఆయన ప్రస్తుతం ఆక్సిజన్ సాయంతో ఊపిరితీసుకుంటున్నారు.
"కుటుంబ సభ్యుల కోరిక మేరకు మిల్కాసింగ్‌ను డిశ్చార్జ్ చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉన్నారు" అని మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.
మిల్కా సింగ్ భార్య నిర్మలా కౌర్‌కు ఆక్సిజన్ అవసరం రాగా.. శనివారం ఐసీయూకు తరలించినట్లు వైద్యులు పేర్కొన్నారు.