కొవిడ్‌తో ఆస్ప్రతిలో చేరిన భారత లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్.. ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆక్సిజన్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఆయనను ఐసీయూ నుంచి వేరే గదికి మార్చినట్లు వెల్లడించారు. ఆయన ఇప్పటికీ కాస్త బలహీనంగా ఉన్నారని తెలిపారు. కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన మిల్కా సింగ్‌కు నిమోనియా కూడా వచ్చింది.
నిలకడగా మిల్కా సింగ్ ఆరోగ్యం - ఫోర్టిస్ ఆస్పత్రి
కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన భారత స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆక్సిజన్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆయన భార్య కూడా కొవిడ్ నిమోనియాతో అదే ఆస్పత్రిలో చేరారు.
మిల్కా సింగ్, భారత స్ప్రింటర్
మరోవైపు మిల్కా సింగ్ భార్య నిర్మలా కౌర్ కూడా అదే కొవిడ్ నిమోనియాతో సోమవారం ఆస్పత్రిలో చేరారు. మిల్కా సింగ్‌కు కరోనా నిర్ధరణ అయినప్పుడు వారు కుటుంబ సభ్యులు కూడా పరీక్షలు చేసుకోగా వారందరికీ నెగెటివ్‌గా తేలింది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని నిశీతంగా పరిశీలిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.