15ఏళ్ల తర్వాత రింగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్, మరో దిగ్గజం రాయ్ జోన్స్ జూనియర్ మధ్య శనివారం జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. లాస్ ఏంజెల్స్ వేదికగా ఎనిమిది రౌండ్లు పాటు సాగిన ఈ పోరులో టైసన్, జోన్స్.. ఇద్దరు అద్భత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఛారిటబుల్ ట్రస్టులకు విరాళంగా ఇవ్వనున్నారు.
"ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా చారిటబుల్ ట్రస్టులకు విరాళాలను సేకరిస్తున్నాం. ఈ ప్రపంచం కోసం మేం ఏదైనా మంచి చేస్తాం. మళ్లీ ఇలాంటి ఎగ్జిబిషన్ మ్యాచులు ఆడుతాం"
-టైసన్, దిగ్గజ బాక్సర్