తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎఫ్‌2 టైటిల్‌ను గెలుచుకున్న మిక్‌ షుమాకర్‌ - racer mike shoemaker

బహ్రెయిన్​లో జరిగిన చివరి రేసులో దిగ్గజ ఫార్ములావన్ రేసర్ మైకేల్ షుమాకర్ కుమారుడు మైక్​ షూమాకర్​ ఎఫ్‌2 టైటిల్‌ గెలిచాడు. ఈ టైటిల్​ను అందుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశాడు.

mike shoemaker
మిక్‌ షుమాకర్

By

Published : Dec 7, 2020, 6:56 AM IST

వచ్చే ఏడాది ఎఫ్‌1 అరంగేట్రం చేయనున్న మిక్‌ షుమాకర్‌ (ప్రెమా) ఆదివారం ఎఫ్‌2 టైటిల్‌ గెలిచాడు. బహ్రెయిన్‌లో జరిగిన చివరి రేసులో అతడు 18వ స్థానంలో నిలిచినా.. మొత్తంగా అత్యధిక పాయింట్లతో ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. 21 ఏళ్ల మిక్‌.. ఫార్ముల్‌వన్‌ దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ కుమారుడు. "ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా గొప్పగా అనిపిస్తోంది" అని మిక్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఎఫ్‌1లో అతడు హాస్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

మైక్‌ తండ్రి మైకేల్‌ షుమాకర్​ దిగ్గజ ఫార్ములావన్ రేసర్. ఏడుసార్లు ఫార్ములావన్‌ విజేతగా అవతరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డును లూయిస్‌ హామిల్టన్‌ ఈ ఏడాదే సమం చేశాడు. 2013లో షూమాకర్‌ ఒక రేసులో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. అతడు కోలుకోవాలని కుటుంబ సభ్యులు ఎంతగానో ఆరాటపడుతున్నారు.

ఇదీ చూడండి : హామిల్టన్​ అదరహో.. ప్రపంచ ఛాంపియన్​గా ఏడోసారి

ABOUT THE AUTHOR

...view details