జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల నిరసనలతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడికిపోతోంది. ఈ క్రమంలో పోరాటం చేస్తున్న వారికి అండగా నిలిచాడు అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు మైకేల్ జోర్డాన్. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య తదితర అంశాల కోసం రానున్న పదేళ్ల పాటు దాదాపు 100 మిలియన్ యూఎస్ డాలర్లు ఖర్చు పెట్టనున్నట్లు చెప్పాడు జోర్డాన్. ఈ మేరకు ఓ ప్రకటనను చేశాడు.
"నల్లజాతీయుల కోసం పనిచేసే పలు సంస్థలకు రానున్న పదేళ్ల పాటు 100 మిలియన్ డాలర్లు అందించనున్నాం. జాతి సమానత్వం, సామాజిక న్యాయం, విద్య తదితర విషయాల్లో భాగంగా ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు" -మైకేల్ జోర్డాన్, బాస్కెట్బాల్ ప్లేయర్