టోక్యో ఒలింపిక్స్- 2020 దగ్గర పడుతున్న వేళ చైనా జోరు పెంచింది. ఆ దేశ బాక్సర్లు బంగారు పతకం తేచ్చేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే అమెరికా స్టార్ బాక్సర్, ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఫ్లాయిడ్ మేవేదర్ను చైనా బాక్సింగ్ జట్టుకు ప్రత్యేక సలహాదారుడిగా నియమించింది. ఈ విషయాన్ని చైనీస్ బాక్సింగ్ ఫెడరేషన్ వెల్లడించింది.
2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో చైనా తరఫున తొలిసారి ఈ క్రీడలో కాంస్య పతకం గెలిచాడు జోషిమ్మింగ్. అతడే 2008, 2012 క్రీడల్లో బంగారు పతకాలు సాధించాడు. అయితే రియోలో ఆ దేశ బాక్సర్లు బాగా నిరాశపరచడం వల్ల టోక్యోలోనైనా మెరుగ్గా రాణించేలా తర్ఫీదు ఇస్తోంది.