తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2020, 5:50 PM IST

ETV Bharat / sports

కూరగాయలు అమ్ముతున్న ఆ అథ్లెట్స్​కు తలో రూ.5లక్షలు

కరోనా వల్ల కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోన్న ఆర్చర్​ నీరజ్​ చౌహాన్​, బాక్సర్​ సునీల్​ చౌహాన్​కు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించింది క్రీడా మంత్రిత్వ శాఖ. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్​ రిజిజు ట్వీట్​ చేశారు.

chauhan
అథ్లెట్స్​కు రూ.5లక్షలు ఆర్థిక సాయం

కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోన్న ఆర్చర్ నీరజ్​ చౌహాన్​, బాక్సర్​ సునీల్​ చౌహాన్​కు క్రీడా మంత్రిత్వ శాఖ ఆదుకుంది. బతుకు తెరువు కోసం కూరగాయలు అమ్ముకుంటోన్న వీరిద్దరికి చెరో రూ.5లక్షల ఆర్థిక సాయం అందించింది.

"కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న అథ్లెట్స్​ నీరజ్​ చౌహాన్​, సునీల్​ చౌహాన్​కు దీన్​ దయాల్​ ఉఫాధ్యాయ​ ద్వారా తలో రూ.5 లక్షలు అందించడం చాలా సంతోషంగా ఉంది"

-కిరణ్​ రిజిజు, కేంద్ర క్రీడా శాఖా మంత్రి

కష్టకాలంలో ఉన్న తమకు ఈ సాయం అందించడంపై నీరజ్​, సునీల్​ చౌహాన్​ సహా వారి కుటుంబసభ్యులు ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు. ఈ ఏడాది ఖేలో ఇండియా యూనివర్సీటీలో సునీల్​ స్వర్ణ పతాకం అందుకున్నాడు. సీనియర్​ ఆర్చరీ ఛాంఫియన్​షిప్​లో నీరజ్​ వెండి పతాకం గెలుచుకున్నాడు.

ఇదీ చూడండి కేఎల్​ రాహుల్​ కాదు పంత్​ సరైనోడు :​ లారా

ABOUT THE AUTHOR

...view details