Commonwealth games: మీరాబాయి సరికొత్త చరిత్ర.. కామన్వెల్త్లో స్వర్ణం - మీరాబాయికి కామన్వెల్త్లో గోల్డ్ మెడల్

22:21 July 30
మీరాబాయికి గోల్డ్ మెడల్
Commonwealth games meera bai chanu Gold medal: కామెన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు జోరు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రెండు పతకాలు(రజతం, కాంస్యం) రాగా ఇప్పుడు స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. 2018 కామెన్వెల్త్ క్రీడల్లో భారత్రు ఇదే మొదటి గోల్డ్ మెడల్. 49కేజీల విభాగంలో స్నాచ్‌లో లో 88 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీల బరువు ఎత్తి రికార్డు సృష్టించింది. మొత్తంగా 201 కేజీల బరువును ఈ ఘనత సాధించింది. దీంతో ఈ ఒకే రోజులు భారత్‌కు మూడు మెడల్స్ వచ్చినట్లైంది.
అంతకుముందు 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజత పతకం అందుకోగా.. 61కేజీలో విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించాడు. అయితే ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ 135 కేజీలు) ఎత్తి.. స్వర్ణానికి కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో మొదటి ప్రయత్నంలో 135 కేజీలు ఎత్తిన సర్గార్.. మిగిలిన రెండు ప్రయత్నాల్లో 139 కేజీలను ఎత్తలేకపోయాడు. ఇక 61కేజీలో విభాగంలో బ్రాంజ్ మెడల్ అందుకున్న గురురాజ్.. మొత్తం 269కిలోల(118kg+151kg బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. ఇతడు 2018 కామన్వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్ అందుకున్నాడు.
ఇదీ చూడండి:భారత్ బోణీ.. వెయిట్ లిఫ్టింగ్‌లో రెండు పతకాలు.. గాయంతోనే 248 కేజీలు ఎత్తి!