ఈ సారికి రజతం మాత్రమే దక్కింది.. కానీ పోరాటం ఆగదని భారత రెజ్లర్ రవికుమార్ తెలిపాడు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా పోరాడతానని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.
" నేను రజతం కోసం టోక్యోకు రాలేదు. ఇది నాకు సంతృప్తిని ఇవ్వలేదు. కానీ ఈసారి నాకు రజతమే దక్కింది.. ఎందుకంటే ఉగెవ్ జవుర్ ఈరోజు సమర్థమైన రెజ్లర్. అయితే నేను అనుకున్నది మాత్రం సాధించలేదు. నేను సిల్వర్ పతకంతోనే ఆగిపోను. వచ్చే ఒలింపిక్స్‌లో సమర్థవంతంగా, దృఢంగా సిద్ధమవుతా"
-- రవికుమార్ దహియా, భారత రెజ్లర్
'ఉగెవ్ జవుర్ రెజ్లింగ్ స్టైల్ బాగుంది. నేను నా ఆట ఆడేందుకు వీలు లేకుండా పోయింది. నేను ఎలా ఆడానో నాకే తెలియదు. అతను చాలా స్మార్ట్‌గా రెజ్లింగ్ ఆడాడు.. 'అని దహియా చెప్పుకొచ్చాడు.
"దహియా ముందు నుంచి ఆడుతున్నాడని.. పక్కనుంచి కూడా ఆడాలని టోక్యోలోని కోచ్‌లు చెప్తే బాగుండేదని దహియా కోచ్ మహాబలి సత్పాల్ స్పష్టం చేశాడు. రవి.. రష్యన్ రెజ్లర్ కంటే సమర్థుడు. గోల్డ్ పతకం కొట్టేందుకు సువర్ణావకాశం వచ్చింది."
-- మహాబలి సత్పల్, దహియా చిన్ననాటి కోచ్