ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్న ప్రతిష్ఠాత్మక యూరోపియన్ టూర్కు భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ దూరంకానుంది. అనారోగ్యం కారణం వల్ల టోర్నీకి అందుబాటులో ఉండట్లేదని స్పష్టం చేసింది.
"గత రెండు వారాల నుంచి డెంగీ జ్వరంతో బాధపడుతున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. ప్రస్తుతం కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. అందుకే ఈ టోర్నీలో ఆడలేకపోతున్నా. వచ్చే ఏడాది.. టోర్నీలో మీ అందర్నీ పలకరిస్తాను. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నా."