చైనా బీజింగ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనుబాకర్-సౌరభ్ చౌదరి జోడి స్వర్ణాన్ని నెగ్గింది. చైనాకు చెందిన జియాంగ్ - పాంగ్ వీ ద్వయంపై 16-6 తేడాతో గెలిచింది.
షూటింగ్ ప్రపంచకప్‌లో మను-సౌరభ్‌కు పసిడి - manubakar
బీజింగ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు మనుబాకర్- సౌరభ్ చౌదరి జోడి గోల్డ్ నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో చైనా ద్వయాన్ని ఓడించింది. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో స్వర్ణం.
![షూటింగ్ ప్రపంచకప్‌లో మను-సౌరభ్‌కు పసిడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3104611-thumbnail-3x2-shooting.jpg)
మనుబాకర్ -సౌరభ్ చౌదరి
అర్హత పోటీలో 482 పాయింట్లే సాధించిన మనుబాకర్, సౌరబ్... ఫైనల్స్‌లో మాత్రం సత్తా చాటి పసిడి కైవసం చేసుకున్నారు. 483.5 పాయింట్ల వద్ద ముగించి అందరికంటే ముందు నిలిచారు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో స్వర్ణం. అంజుమ్- దివ్యాంశ్ జోడి ఈరోజు తొలి స్వర్ణాన్ని గెలిచింది.
ఈ ఏడాది ప్రారంభంలో న్యూదిల్లీ షూటింగ్ ప్రపంచకప్‌లోనూ మనుబాకర్- సౌరభ్ ద్వయం బంగారు పతకాన్ని గెలిచింది. ఈ టోర్నీలో పురషుల సింగిల్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ గోల్డ్ గెలిచాడు 16 ఏళ్ల సౌరభ్ చౌదరి.