తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాతీయ షూటింగ్ ఛాంపియన్​షిప్​లో మనుకు స్వర్ణాలు

భోపాల్​లో జరుగుతున్న జాతీయ షూటింగ్ ఛాంపియన్​షిప్​లో స్టార్ షూటర్ మను బాకర్.. స్వర్ణాలు నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సీనియర్, జూనియర్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు సొంతం చేసుకుంది.

Manu Bhaker wins gold medals in senior, junior 10m air pistol events in Nationals
మను బాకర్

By

Published : Dec 24, 2019, 5:56 PM IST

జాతీయ షూటింగ్ ఛాంపియన్​షిప్​లో మనుబాకర్ సత్తాచాటింది. మధ్యప్రదేశ్​లోని భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సీనియర్, జూనియర్ విభాగాల్లో స్వర్ణాలు సాధించింది.

మంగళవారం జరిగిన సీనియర్ విభాగం పోటీలో 241 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది మను. అనంతరం జరిగిన జూనియర్ విభాగంలో 243 పాయింట్లు సాధించి పసడి పట్టింది. కంబైన్డ్ క్వాలిఫికేషన్స్​లో 588 పాయింట్లు దక్కించుకుంది.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సీనియర్ విభాగంలో దేవాన్షి ధామా రజతం కైవసం చేసుకుంది. యశస్విని సింగ్ దేశ్వాల్ కాంస్యం సొంతం చేసుకుంది. ఇప్పటికే మను, యశస్విని 2020 టోక్యో ఒలింపిక్స్​ బెర్త్​ ఖరారు చేసుకున్నారు.

ఇదీ చదవండి: 'ఆటకు దూరమయ్యా.. ఆడటం మర్చిపోలేదు'

ABOUT THE AUTHOR

...view details