తెలంగాణ

telangana

ETV Bharat / sports

పతకం రాకపోయినా.. ఒలింపిక్స్ స్థానం పదిలం

భారత వర్ధమాన షూటర్​ మను బాకర్​ ఒలింపిక్స్​ బెర్త్​ను ఖరారు చేసుకుంది. జర్మనీలోని మూనిక్​లో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్​లో నాలుగోస్థానంలో నిలిచింది. పిస్టోల్​ లోపం కారణంగా పతకం సాధించలేపోయింది.

పతకం రాకపోయినా.. ఒలింపిక్స్ స్థానం పదిలం

By

Published : May 29, 2019, 8:57 PM IST

జర్మనీలోని మూనిక్​లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్​ ఫెడరేషన్(ఐఎస్​ఎస్​ఎఫ్​) ప్రపంచకప్​లో భారత షూటర్​ మను బాకర్ నాలుగో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ టోక్యో ఒలింపిక్స్ కోటాలో 7 స్థానాన్ని పదిల పరచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో 201 పాయింట్లు సాధించింది.

షూటర్ మను బాకర్

10 మీటర్ల ఎయిర్ పిస్టోల్​ విభాగంలో భారత్​ తరఫున ఒలింపిక్స్​కు అర్హత సాధించిన తొలి మహిళ మనునే. పిస్టోల్​లో లోపం తలెత్తడం వల్ల మను బాకర్ పాయింట్ల సాధనలో వెనుకబడింది. ఈ కారణంగా ఆమె అసంతృప్తి చెందింది. పోడియం దగ్గరకు కూడా రాలేదు.

పురుషుల 10 మీటర్ల ఎయిర్​ పిస్టోల్​ విభాగంలో ఇప్పటికే సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ ఒలింపిక్స్ బెర్త్​ ఖరారు చేసుకున్నారు. వీరు ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన ప్రపంచకప్​లో సత్తాచాటి ఒలింపిక్స్​కు అర్హత సాధించారు.

ABOUT THE AUTHOR

...view details