తెలంగాణ

telangana

ETV Bharat / sports

అనుకోకుండా పిస్తోల్​ పట్టి- ఒలింపిక్స్​ స్థాయికి.. - manu bhaker shooter

భారత స్టార్​ షూటర్​ మనుబాకర్​​... ఇటీవల బ్రెజిల్​లో జరిగిన  షూటింగ్​ ప్రపంచకప్​ డబుల్స్​ విభాగంలో పసిడి గెలిచింది. వచ్చే ఏడాది టోక్యో  ఒలింపిక్స్​ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. యావత్​ దేశం ఈ క్రీడాకారిణి పతకం తెస్తుందని గంపెడు ఆశలు పెట్టుకుంది. తాజాగా ఈటీవీ భారత్​ ఆమెను పలకరించింది.

అనుకోకుండా పిస్తోల్​ పట్టి.. ఒలింపిక్స్​ స్థాయికి చేరింది

By

Published : Sep 20, 2019, 7:04 AM IST

Updated : Oct 1, 2019, 7:05 AM IST

ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖిలో మనుబాకర్​

హర్యానాలోని జజ్జర్​లో పుట్టిన మనుబాకర్​.. నేడు దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. 17 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్​లో భారత్​కు స్వర్ణం తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మెగాటోర్నీలో భాగంగా నవంబర్​ 17న జరగనున్న పుతియన్​ ప్రపంచకప్​ ఫైనల్స్​ కోసం సన్నాహాల్లో ఉన్న ఈ స్టార్​ షూటర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

ఎలా వచ్చిందంటే...?

మనుబాకర్​.. గతంలో మార్షల్​ ఆర్ట్స్​, బాక్సింగ్​, టెన్నిస్​, స్కేటింగ్​ వంటి పలు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించింది. అయితే వాటన్నింటిని కాదని.. అనుకోకుండా షూటింగ్​లోకి వచ్చినట్లు చెప్పింది.

ఇప్పటివరకు వివిధ ప్రపంచకప్​ల్లో 6 స్వర్ణాలు సహా కామన్వెల్త్​లోనూ పసిడి సొంతం చేసుకుందిమను. చిన్న వయసులోనే ఇంత గొప్ప స్థాయికి ఎదగడం వెనుక కష్టపడే తత్వంతో పాటు ప్రశాంతమైన మనస్సుతో ఉండటం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణాలే ఆమెను ప్రత్యేకంగా మార్చాయి.

ఇదే ఏడాది మ్యూనిచ్​లో జరిగిన ఏషియన్​ గేమ్స్​లో ఆమె పిస్తోల్​ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రపంచ రికార్డు సాధించే అవకాశం కోల్పోయింది. ప్రస్తుతం కఠోర శిక్షణలో ఉన్న మను... 2020 టోక్యో ఒలింపిక్స్​లో మాత్రం కచ్చితంగా సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేసింది.

ఇవీ చదవండి..

Last Updated : Oct 1, 2019, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details