తెలంగాణ

telangana

ETV Bharat / sports

షూటింగ్ ప్రపంచకప్​లో మనుబాకర్​కు స్వర్ణం

చైనా పుతియాన్ వేదికగా జరుగుతోన్న షూటింగ్ ప్రపంచకప్​లో భారత షూటర్ మనుబాకర్ స్వర్ణం నెగ్గింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 244.7 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

మనుబాకర్

By

Published : Nov 21, 2019, 10:27 AM IST

ఐఎస్​ఎస్​ఎఫ్​ షూటింగ్ ప్రపంచకప్​లో భారత షూటర్ మనుబాకర్ అదరగొట్టింది. చైనా పుతియాన్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో పసిడి కైవసం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం నెగ్గింది.

మొత్తం 244.7 పాయింట్లు సాధించి జూనియర్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసింది మనుబాకర్. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచకప్ స్వర్ణం నెగ్గిన రెండో భారత షూటర్​గా ఘనత సాధించింది. ఇంతకు ముందు ఈ టోర్నీలో హీనా సిద్దు గోల్డ్ గెలిచింది. ఈ పోటీలో మరో భారత షూటర్ యశస్విని దేశ్వాల్ ఆరో స్థానంలో నిలిచింది.

అయితే మంగళవారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం​లో మను ఫైనల్​కు​ అర్హత సాధించడంలో విఫలమైంది. రెండు ర్యాపిడ్ ఈవెంట్లలో కలిపి 583 పాయింట్లు సాధించిన మను.. త్రుటిలో తుదిపోరుకు చేరలేకపోయింది. మరో షూటర్ రాహీ సర్నోబాత్​ కూడా ఈ పోటీలో నిరాశపరిచింది.

ఇదీ చదవండి: పింక్ టెస్టుతో పెద్ద పండగే: గంగూలీ

ABOUT THE AUTHOR

...view details