తెలంగాణ

telangana

ETV Bharat / sports

పతకానికి అడుగు దూరంలో భారత మహిళా బాక్సర్ - మేరీకోమ్ లేటేస్ట్ న్యూస్

భారత మహిళా బాక్సర్​ మంజురాణి.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో క్వార్టర్స్​కు దూసుకెళ్లింది. స్టార్ బాక్సర్ మేరీకోమ్.. మంగళవారం తన పోరాటాన్ని ఆరంభించనుంది.

పతకానికి అడుగు దూరంలో భారత బాక్సర్

By

Published : Oct 8, 2019, 8:12 AM IST

రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్‌ మంజురాణి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన 48 కేజీల విభాగం ప్రీక్వార్టర్స్‌లో 5-0తో రోజస్‌ సెడెనో (వెనిజువెలా)ను చిత్తు చేసి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. గత టోర్నీ కాంస్య పతక విజేత హయాంగ్‌ మి (దక్షిణ కొరియా)తో క్వార్టర్స్​లో తలపడనుంది.

మరో భారత బాక్సర్‌ మంజు బంబేరియా (64 కేజీలు) ఓడిపోయింది. 1-4తో ఏంజెలా కార్ని (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూసింది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌ (51 కేజీలు) తన పోరాటాన్ని మంగళవారం ఆరంభించనుంది. తొలి రౌండ్లో బై దక్కించుకున్న మేరీ.. ప్రీక్వార్టర్స్‌లో జుటామస్‌ (థాయ్‌లాండ్‌)తో పోటీపడనుంది. మరో ప్రీక్వార్టర్స్‌లో స్వీటీ బూరా (75 కేజీలు).. లారెన్‌ ప్రైస్‌ (స్కాట్లాండ్‌)తో తలపడనుంది.

ఇది చదవండి: పోలీసుల పొరపాటు... వర్షంలో తడిసిన భారత క్రికెటర్లు

ABOUT THE AUTHOR

...view details