స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన 24 ఏళ్ల కెరీర్‌కు తాజాగా జరిగిన మ్యాచ్‌తో ముగింపు పలికిన సంగతి తెలిసిందే. లావెర్ కప్ 2022లో నాదల్‌తో కలిసి అతడు తన చివరి మ్యాచ్ ఆడాడు. ఈ డబుల్స్ మ్యాచ్‌లో ఈ జోడి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఒక వింత సంఘటన చోటుచేసుకుంది.
అదేంటంటే.. వీరిద్దరి మ్యాచ్‌కు ముందుకు సిట్సిపాస్, డీగో మధ్య సింగిల్స్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో 6-1, 6-2తో సిట్సిపాస్ విజయం సాధించాడు. అయితే మ్యాచ్‌లో తొలి సెట్‌ను సిట్సిపాప్ కైవసం చేసుకున్న తర్వాత ఆటకు విరామం వచ్చింది. ఈలోగా మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక ఆగంతకుడు టెన్నిస్ కోర్టులోకి దూసుకెళ్లి వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే తన మోచేతికి నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత పిచ్చి పట్టినట్లు అరుస్తూ మంటలు ఆర్పుకున్నాడు.