తెలంగాణ

telangana

ETV Bharat / sports

సింధు ఈజ్​ బ్యాక్​.. మలేసియా ఓపెన్​ క్వార్టర్స్​లోకి ఎంట్రీ - మలేసియా ఓపెన్​

Sindhu Malaysia Open: భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు.. మలేసియా ఓపెన్​లో మంచి ప్రదర్శన చేస్తోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్​ మ్యాచ్​లో థాయ్​లాండ్​ క్రీడాకారిణిపై నెగ్గి.. క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్​లో ప్రణయ్​ కూడా మరో అడుగు ముందుకేశాడు.

Sindhu registers comeback win against Chaiwan
Sindhu registers comeback win against Chaiwan

By

Published : Jun 30, 2022, 12:33 PM IST

Sindhu Malaysia Open: ఇటీవల ఇండోనేసియా ఓపెన్​లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు.. మలేసియా ఓపెన్​లో అదరగొడుతోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్​లో పిటయ్​పోర్న్​ చైవాన్​పై (థాయ్​లాండ్​) 19-21, 21-9, 21-14 తేడాతో గెలిచింది. తొలి గేమ్​లో ఓడినా.. తర్వాతి రెండు గేమ్​ల్లో ఆధిక్యంతో క్వార్టర్స్​ చేరింది. ఒలింపిక్స్​లో రెండు సార్లు పతకాలు గెల్చిన సింధు.. క్వార్టర్​ ఫైనల్లో తైవాన్​ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి తై-జు- యింగ్​తో అమీతుమీ తేల్చుకోనుంది.

పురుషుల సింగిల్స్​లో హెచ్​ఎస్​ ప్రణయ్​ కూడా క్వార్టర్స్​లోకి ప్రవేశించాడు. ప్రపంచ నెం.4 షట్లర్​, చైనీస్​ తైపీ ఆటగాడు చౌ టియన్​-చెన్​ను 21-15, 21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. మరోవైపు సింగిల్స్​లో పారుపల్లి కశ్యప్​, పురుషుల డబుల్స్​లో సాత్విక్​ సాయిరాజ్​- చిరాగ్​ శెట్టి జోడీ కూడా గురువారం ప్రిక్వార్టర్స్​ మ్యాచ్​లు ఆడనున్నారు.

ABOUT THE AUTHOR

...view details