Malaysia Masters quarter final PV Sindhu loss: మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోటీల్లో ఆమె ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై 13-21 21-12 12-21 తేడాతో చతికిలపడింది. 55నిమిషాల పాటు సాగిందీ పోరు. కెరీర్లో ఇది ఆమెకు 17వ ఓటమి.
Malaysia Masters: క్వార్టర్ ఫైనల్స్‌లో సింధుకు షాక్.. మళ్లీ ఆమె పైనే.. - Malaysia masters Quarter final
Malaysia Masters 2022 PV Sindhu loss: రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) మరోసారి స్టార్ షట్లర్ పీవీ సింధుకు షాక్ ఇచ్చింది. మలేసియా మాస్టర్స్ క్వార్టర్స్‌లో ఓడించింది.
మలేసియా మాస్టర్స్ పీవీ సింధు ఓటమి
ఇటీవల మలేసియా ఓపెన్ క్వార్టర్స్‌లోనూ తై జు చేతిలో ఓడిన సింధు ఓడిపోయింది. ఆమెపై మెరుగైన రికార్డు లేకపోవడం సింధుకు ప్రతికూలాంశం. ఇప్పటి వరకు ఈ మ్యాచ్‌తో కలిపి వీరిద్దరు 22 సార్లు తలపడగా.. సింధు అయిదింట్లో గెలవగా, 17 మ్యాచ్‌ల్లో తై జు పైచేయి సాధించింది.
ఇదీ చూడండి: Ganguly: 'దాదా'@50.. 'ఫియర్ లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్'