Malaysia masters super 500: మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ సెమీఫైనల్ చేరగా..డబుల్ ఒలింపిక్ విజేత పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ తై జూయింగ్ (చైనీస్ తైపీ) చేతిలో సింధూ ఓటమి పాలైంది.
టాప్ 10 ప్లేయర్ ప్రణయ్ మరోసారి తన సత్తా చాటాడు. పురుషుల క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్, జపాన్ స్టార్ కంటా త్సునెయమాను 25-23, 22-20 తేడాతో ఓడించాడు. 60 నిమిషాల పాటు జరిగిన పోరులో ప్రణయ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. జపాన్ షట్లర్ నుంచి కొంత ప్రతి ఘటన ఎదురైనా ప్రణయ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
Malaysia Masters quarter final PV Sindhu loss: మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోటీల్లో ఆమె ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై 13-21 21-12 12-21 తేడాతో చతికిలపడింది. 55నిమిషాల పాటు సాగిందీ పోరు. కెరీర్లో ఇది ఆమెకు 17వ ఓటమి.
ఇటీవల మలేసియా ఓపెన్ క్వార్టర్స్‌లోనూ తై జు చేతిలో ఓడిన సింధు ఓడిపోయింది. ఆమెపై మెరుగైన రికార్డు లేకపోవడం సింధుకు ప్రతికూలాంశం. ఇప్పటి వరకు ఈ మ్యాచ్‌తో కలిపి వీరిద్దరు 22 సార్లు తలపడగా.. సింధు అయిదింట్లో గెలవగా, 17 మ్యాచ్‌ల్లో తై జు పైచేయి సాధించింది.
ఇదీ చదవండి:Malaysia Masters: క్వార్టర్ ఫైనల్స్‌లో సింధుకు షాక్.. మళ్లీ ఆమె పైనే..