ఆరుగురు భారత బాక్సర్లు ఆసియన్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఫైనల్లో పసిడి కోసం శుక్రవారం తుది పోరు జరుగనుంది. పురుషుల విభాగంలో అమిత్ పంఘల్ (52 కేజీలు), కవీందర్ సింగ్ (56 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), దీపక్ సింగ్ (49 కేజీలు) తుదిపోరుకు అర్హత సాధించారు.
ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సత్తా
రింగ్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆరుగురు భారత బాక్సర్లు పసిడి పోరుకు అర్హత సాధించారు.
కవీందర్ సింగ్
మహిళల విభాగంలో పూజా రాణి (81 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు.
మహిళల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సోనియా చహల్ (57 కేజీలు), మనీషా మౌన్ (54 కేజీలు) పురుషుల విభాగంలో శివ థాపా (60 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) సెమీఫైనల్లో ఓటమిపాలై కాంస్య పతకాలు సాధించారు.