తెలంగాణ

telangana

ETV Bharat / sports

లండన్ వీడియో గేమ్ ఫెస్ట్​ కు వెళ్తారా?

ప్రతి సంవత్సరం జరిగే లండన్ వీడియో గేమ్ ఫెస్ట్.. ఈ ఏడాది అంతే సందడిగా జరుగుతోంది. ఈనెల 14వ  తేదీ వరకు జరగనున్న ఈ వేడుకలో సుమారు 200కు పైగా గేమ్స్​ అందుబాటులో ఉన్నాయి. యూకేలో ఈ వ్యాపారం విలువ 2018లో రికార్డు స్థాయిలో దాదాపు 7.4 బిలియన్ డాలర్లు నమోదైంది. గేమ్స్ పరిశ్రమలోని చిరు వ్యాపారులకు ఇది ఉత్సాహాన్నిస్తోంది.

లండన్ వీడియో గేమ్ ఫెస్ట్​ కు వెళ్తారా?

By

Published : Apr 7, 2019, 7:31 AM IST

లండన్ వీడియో గేమ్ ఫెస్ట్​ కు వెళ్తారా?

వీడియో గేమ్స్ అంటే మీకు చెప్పలేనంత ఇష్టమా.. కంప్యూటర్ తెరపై ఎలాంటి గేమ్​ అయినా అవలీలగా ఆడేస్తారా అయితే ఇది మీకోసమే. లండన్​లో ప్రతి ఏడాది జరిగే 'వీడియో గేమ్ ఫెస్ట్' ఈ సంవత్సరం అంతే సందడిగా జరుగుతోంది. తక్కువ బడ్జెట్​లో రూపొందిన 200 గేమ్స్.. పిల్లల నుంచి పెద్దల వరకు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

  • ఆన్​లైన్ వీడియో గేమ్ తయారీదారుల్లో చాలా మంది యుక్తవయసు వారే. ఉదయం ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో ఈ గేమింగ్ సాఫ్ట్​​వేర్​లు తయారుచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.

"ఉదయం పని చేసుకుంటూ సాయంత్రం ఈ సాఫ్ట్​వేర్స్ రూపొందిస్తున్నాం. బడ్జెట్ విషయంలో మాకు పరిమితులున్నాయి. ఉన్న వాటితోనే సర్దుకోవాలి. నిబంధనలు విధించేవారు ఎవరూ లేరు. అందుకే ఒడుదొడుకులు ఎదురైనా విజయం సాధిస్తున్నాం. ఈ రంగంలో పేరు తెచ్చుకుంటున్నాం "

-- రాబర్ట్ ఫెనెమోర్, అప్పర్ గ్రూమ్ గేమ్స్​ సృష్టికర్తల్లో ఒకరు.


యూకేలో అన్ని రంగాల్లో అభివృద్ధి ఉన్నట్లే గేమింగ్ రంగంలోనూ జోరు కొనసాగుతోంది. 2018లో యూకే గేమింగ్ మార్కెట్ రికార్డు స్థాయిలో 5.7 బిలియన్ బ్రిటిష్ పౌండ్ల (భారతదేశ కరెన్సీలో సుమారు రూ. 51 వేల 450 కోట్లు) విలువను కలిగి ఉంది. 2017 సంవత్సరం కంటే ఇది 10 శాతం ఎక్కువ. గేమ్స్ పరిశ్రమలోని చిరు వ్యాపారులకు ఇది ఉత్సాహాన్నిస్తోంది.

  1. యూకే మార్కెట్​లో ఆదాయం పెరిగేందుకు ప్రధాన కారణం వీడియో గేమింగ్ సాఫ్ట్​ ​వేర్​ల అమ్మకం. దీని విలువ సుమారుగా 4.01 బిలియన్ బ్రిటిష్ పౌండ్లు(భారత కరెన్సీలో రూ.36 వేల 195 కోట్లు)గా ఉంది.
  2. సంప్రదాయ వీడియో గేమ్ పరిశ్రమ హార్డ్​వేర్ నుంచి డిజిటల్ రంగంలోకి మారింది. సినిమాలు, సంగీతం అనేవి కొన్నిసార్లు ప్రతిబంధకాలుగా మారాయి.
  3. గేమింగ్ వ్యవస్థలో భయపడాల్సింది ఏమి లేదని, ఇప్పుడు ఎక్కువ శాతం గేమ్​లన్నీ ఆన్​లైన్​లోనే లభిస్తున్నాయని 22 ఏళ్ల కీరన్ బాండ్ చెప్పాడు.

"నా కంప్యూటర్​లో సీడీ పెట్టేందుకు అనువుగా లేదు. ఈ కారణంతో ఆన్​లైన్ గేమ్స్​ ఎక్కువగా ఆడుతున్నా. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంది"

-- కీరన్ బాండ్, ఆన్​లైన్ గేమర్

యూకే గేమింగ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం 2 వేలకు పైగా వీడియో గేమ్ కంపెనీలు ఉన్నాయి. సుమారు 47 వేల మంది ఇందులో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి ఏడాది జరిగే ఈ వీడియో గేమ్ ఫెస్ట్ ఈనెల 2 నుంచి 14వ తేదీ వరకు జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details