తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆరంభ వేడుకలకు వాళ్లు దూరం.. కారణం ఇదే!

శుక్రవారం జరిగే ఒలింపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చాలామంది అథ్లెట్లు దూరంగా ఉండనున్నారు. భారత్​ నుంచి 30 మంది వరకు అథ్లెట్లు, మరికొందరు అధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు భారతీయ ఒలిపింక్ బృందం స్పష్టం చేసింది. విదేశాలు కూడా.. ఆయా బృందాల్లో సంఖ్యను చాలా వరకు తగ్గించాయి.

Olympics
ఒలింపిక్స్

By

Published : Jul 22, 2021, 1:56 PM IST

రేపటి నుంచే అట్టహాసంగా మొదలవనున్న విశ్వక్రీడల ప్రారంభోత్సవంలో భారత్​ తరపున కేవలం 30 మంది మాత్రమే పాల్గొననున్నారు. అధికారులు, కోచ్‌లతో పాటు.. సహాయక సిబ్బంది, రిజర్వ్ అథ్లెట్లతో కలిపి 228 మంది ఈ మెగా ఈవెంట్​కి హాజరయ్యారు. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరంభ వేడుకలకు భారత బృందాన్ని కుదించినట్లు అధికారులు ప్రకటించారు. అంతేగాక.. 24వ తేదీన జరిగే ఈవెంట్​లో కొందరు అథ్లెట్లు పాల్గొనాల్సి ఉందని తెలిపారు.

"ఆర్చరీ, జూడో, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, టెన్నిస్, హాకీ (పురుషులు, మహిళలు), షూటింగ్ విభాగాల అథ్లెట్లకు 24న మ్యాచ్‌లున్నాయి. వీరంతా ప్రాక్టీస్ చేయాలి. సురక్షితంగా ఉండటమూ ముఖ్యమే."

-నరీందర్ బాత్రా, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు

భారత పతాకాన్ని.. భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్​తో పాటు.. హాకీ పురుషుల జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్​ పట్టుకోని నడవనున్నారు. జపనీస్ అక్షరమాల ప్రకారం భారత్ 21వ స్థానంలో ఉంది ఆరంభ పరేడ్​లో పాల్గొననుంది.

"ఆరంభ పరేడ్​లో ఒక్కో దేశం నుంచి ఆరుగురు అధికారులు పాల్గొనేందుకు అనుమతించారు. ఆటగాళ్లకు ఈ నిబంధనేమీ లేదు. అయినప్పటికీ మన అథ్లెట్లు కరోనా బారిన పడకుండా చూడటం మన బాధ్యత. కాబట్టి ప్రారంభోత్సవంలో పాల్గొనే అథ్లెట్లు, అధికారుల సంఖ్యను 50లోపే ఉండేలా నిర్ణయించాం."

-రాజీవ్ మెహతా, ఐఓఏ సెక్రటరీ జనరల్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details