Lionel Messi World Cup Jersey Auction :దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ గదేడాది జరిగిన సాకర్ వరల్డ్‌కప్‌లో అర్జెంటినాను విశ్వవిజేతగా నిలిపాడు. ఏళ్లుగా ఎదురుచూసిన వరల్డ్ కప్ కలను సాకారం చేశాడు. ఈ ప్లేయర్ సాకర్ వరల్డ్ కప్‌లో ధరించిన జెర్సీలను వేలం వేయగా రికార్డు ధర పలికాయి. ఆరు 10వ నంబర్ జెర్సీలను వేలం వేయగా రూ.64.73 ( 7.8 మిలియన్ డాలర్లు) కోట్లు వచ్చాయి. అయితే వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల చికిత్స కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు మెస్సీ ప్రకటించాడు.
Sothebys Auction House : అర్జెంటినాకు చెందిన సోత్‌బైస్ అనే సంస్థ మెస్సీ వరల్డ్ కప్ జెర్సీలను వేలం వేసింది. న్యూయార్క్‌లోని తమ కార్యాలయంలో సోత్‌బైస్ వీటిని రెండు వారాల పాటు ప్రదర్శనకు ఉంచింది. గురువారం ముగిసిన వేలంలో వాటికి రూ.64 కోట్లు వచ్చాయి. అయితే వాటిని ఎవరు దక్కించుకున్నారన్న విషయం మాత్రం వెల్లడించలేదు. జెర్సీల వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సాంట్ జాన్ డె డూ బార్సెలోనా పిల్లల దవాఖాన నిర్వహిస్తున్న యునికాస్ ప్రాజెక్ట్‌కు, లియో మెస్సీ ఫౌండేషన్ ద్వారా డొనేట్ చేయనున్నాడు.