Argentina vs Australia : అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. 2022లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో చెలరేగిన ఈ స్టార్ ప్లేయర్.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి రెట్టింపు ఉత్సాహంలో ఉన్న మెస్సీ ఇప్పుడు తన ఆట తీరులో మరింత వేగం పెంచాడు. ఈ క్రమంలో ఇటీవలే జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తన సత్తా చాటి అందరిని అబ్బురపరిచాడు.
Messi International Goals : చైనా బీజింగ్ వేదికగా గురువారం అర్జెంటీనా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ ఓ అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లోనే అత్యంత ఫాస్టెస్ట్ గోల్ నమోదు చేశాడు. ఆట మొదలైన నిమిషం 19 సెకన్ల వ్యవధిలోనే అర్జెంటీనాకు ఓ గోల్‌ను అందించిన మెస్సీ స్టేడియంలో ఉన్న అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక మెస్సీ కెరీర్‌లో ఇదే అత్యంత ఫాస్టెస్ట్ గోల్‌గా నమోదు కావడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. దీన్ని చూసిన అభిమనులు ఆనందం అంతా ఇంతా కాదు. 'మెస్సీ సూపర్ స్టార్', 'అప్పటికీ ఇప్పటికీ మెస్సీలో ఏం మార్పులేదని' నెట్టింట అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గత ఏడు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా తరపున మెస్సీకి ఇది ఏడవ గోల్. ఇక ఓవరాల్‌గా ఈ ఏడాది ఆడిన 13 మ్యాచ్‌ల్లో 17 గోల్స్ చేసిన మెస్సీ.. 5 అసిస్ట్‌లు అందించాడు.