తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెస్సీ సంచలన ప్రకటన.. ఇదే అతడి చివరి ప్రపంచకప్‌ అంటా! - మెస్సీ రికార్డ్స్​ ప్రపంచకప్​

అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ సంచలన విషయాన్ని ప్రకటించాడు. ఫిఫా వరల్డ్ కప్​ 2022 ఫైనల్​ తన చివరి మ్యాచ్​ అని తెలిపాడు.

Lionel messi last world cup
మెస్సీ సంచలన ప్రకటన.. అదే అతడి చివరి ప్రపంచకప్‌ అంటా!

By

Published : Dec 14, 2022, 11:58 AM IST

Updated : Dec 14, 2022, 1:22 PM IST

అనుకున్నట్టే జరిగింది. ఖతర్​ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్​ తన చివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌ అని పేర్కొన్నాడు అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ. అర్జెంటీనాకు చెందిన 'డయారియో డిపోర్టివో ఓలే' అనే పత్రికతో మాట్లాడుతూ.. "నా ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ఫైనల్‌ మ్యాచ్‌తో ముగించేలా.. ఇప్పటి వరకు సాధించిన విజయాలకు సంతోషంగా ఉన్నాను. మరో ప్రపంచకప్‌ అంటే చాలా ఏళ్లు ఆగాలి. నేను అప్పటి వరకూ అడగల్గుతానని అనుకోవడంలేదు. ఈ రకంగా ముగించడమే ది బెస్ట్‌" అని పేర్కొన్నాడు.

రికార్డులు సాధించడంపై మెస్సీ స్పందిస్తూ.. "ఇవి అన్నీ మంచివే.. చాలా బాగున్నాయి. కానీ, జట్టు లక్ష్యాలను సాధించడం చాలా ముఖ్యం. అన్నిటికంటే అదే చాలా అందంగా ఉంటుంది. మేము ఇంకా కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. ఈ సారి మేం సాధించేలా సర్వశక్తులు ఒడ్డి పోరాడనున్నాం" అని పేర్కొన్నాడు. 35 ఏళ్ల ఈ సాకర్‌ స్టార్‌ 2022 ప్రపంచకప్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన మెస్సీ ఐదు గోల్స్‌ చేయగా.. మరో మూడు గోల్స్‌కు సహకరించాడు. అత్యధిక గోల్స్‌ జాబితాలో టాప్‌లో ఉన్నాడు.

Last Updated : Dec 14, 2022, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details