భారత వెయిట్ లిఫ్టర్ రాఖీ హల్దర్ రెండు జాతీయ రికార్డులు సృష్టించింది. ఖతర్ దోహా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కప్లో 218 కేజీల బరువులెత్తి వ్యక్తిగత అత్యుత్తమ స్కోర్ నమోదు చేసింది. ఆదివారం రాత్రి జరిగిన మహిళల 64 కేజీల విభాగంలో కాంస్యం దక్కించుకుంది.
స్నాచ్ విభాగంలో 95 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ పోటీలో 123 కేజీల బరువులెత్తి సత్తాచాటింది రాఖీ. జూన్లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో 214 కేజీల(64+120కేజీలు) బరువులెత్తి పసిడి సాధించింది.