ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ బెల్జియన్ గ్రాండ్ ప్రి విజేతగా నిలిచాడు. ఆదివారం పోల్ పొజిషన్ నుంచి రేసు ఆరంభించిన అతడు.. చివరి వరకు ఆధిపత్యాన్ని కొనసాగించాడు. హామిల్టన్ (మెర్సిడస్) కెరీర్‌లో ఇది 89వ విజయం. మెర్సిడస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ మూడో స్థానం సాధించాడు.
హామిల్టన్ ఖాతాలో మరో టైటిల్ - Lewis Hamilton news
ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ బెల్జియన్ గ్రాండ్ ప్రి విజేతగా నిలిచాడు. తద్వారా కెరీర్‌లో 89వ టైటిల్ సాధించాడు.
హామిల్టన్ ఖాతాలో మరో టైటిల్
హామిల్టన్‌కు ఈ సీజన్‌లో ఏడు రేసుల్లో ఇది అయిదో విజయం. షుమాకర్ పేరిట ఉన్న అత్యధిక టైటిళ్ల రికార్డు (91)కు హామిల్టన్ రెండే విజయాల దూరంలో ఉన్నాడు.