Hockey legend charanjit singh died: హాకీ లెజెండ్ చరణ్‌జిత్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న చరణ్‌జిత్.. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడాప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
చరణ్‌జిత్ కెప్టెన్సీలో భారత హాకీ జట్టు 1964 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. 1960 రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఆయన సారథ్యంలో భారత్ రజత పతకం సాధించింది.
1929 నవంబర్ 20న జన్మించిన చరణ్‌జిత్.. పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. హాకీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాక షిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. పద్మశ్రీ, అర్జున అవార్డు కూడా పొందారు చరణ్‌జిత్ సింగ్.