German Open: ఒలింపిక్స్ పసిడి విజేత విక్టర్ అక్సల్సెన్కు షాకిచ్చాడు భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్. జర్మన్ ఓపెన్ సూపర్ 300 సెమీస్‌లో గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్నారు.
శనివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో 21-13, 12-21, 22-20 తేడాతో అక్సల్సెన్పై గెలుపొందాడు సేన్. ఒక గంట పది నిమిషాల పాటు ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరిగింది.